After listening to it a couple of times, I started to like the song 'Vayyarala Jabilli' from the movie 'Theen Maar'. It somehow reminds me of this song - 'Hai Re Hai' from 'Sindhooram'. Manisharma composed the music and Karunya lent his vocals. It's simple, sweet and easily hummable. You can listen to the song here : వయ్యారాల జాబిల్లి.
Pa||
వయ్యారాల జాబిల్లి ఓణి కట్టి..గుండెల్లోన చేరావే గంటె కొట్టి
ఆ నండూరి వారెంకి మళ్లి పుట్టి ..కవ్వింతల్లో ముంచావే కళ్ళే మీటి
నదివలై కదిలా నిలబడక..కలలను వదిలా నిను వెతక
వయసే వరస మార్చినదే..మనసే మధువు చిలికినదే
అడుగే జతను అడిగినదే..అలలై తపన తడిపినదే ||వయ్యారాల జాబిల్లి||
1 Cha||
నీ పరిచయమే ఓ పరవశమై..జగాలు మెరిసేను లే
నా యద గుడిలో నీ అలికిడిని ..పదాలు పలుకవులే
ఆణువణువూ చెలిమి కొరకు..అడుగడుగు చెలికి గొడుగు
ఇది వరకు గుండె లయకు..తెలియదులే ఇంత పరుగు
వయసే వరస మార్చినదే ..మనసే మధువు చిలికినదే ||వయ్యారాల జాబిల్లి||
2 Cha||
నీ ప్రతి తలపు నాకొక గెలుపై..సుఖాలు తొనికేనులే
నీ శ్రుతి తెలిపే కోయిల పిలుపే..తథాస్తు పలికేనులే
గగనములా మెరిసి మెరిసి..పవనములా మురిసి మురిసి
నినుకలిసే క్షణము తలచి..అలుపు అనే పదము మరచి
వయసే వరసా మార్చినదే..మనసే మధువు చిలికినదే ||వయ్యారాల జాబిల్లి||
No comments:
Post a Comment