Monday, February 17, 2014

Prateekshanam from Basanti - Lyrics

ప్రతీక్షణం పెదాలతో ప్రతీక్షణం నిరీక్షణ
ఇదెంత దాటలేని దూరమో కదా

ప్రతీక్షణం పదాలతో ప్రతీక్షణం నిరీక్షణ
ఈ లేత ప్రాయమెంత హాయిదో కదా

నీ స్నేహమే.. హే..  ఏ సరదాకైనా పరదాలే తీసేలా
నీ స్నేహమే.. హే..  నా ప్రేమను ప్రేమతో ప్రేమగా నింపే వేళ

చూస్తున్నా చూస్తున్నా నీ అల్లరి కన్నులలోన
కాస్తైనా కురిసేనా నీ మదిలో మాటల వాన

హే సీతాకోక నిన్నే తాకి చూసాక
నీ రెక్కల రంగే నా మునివేళ్ళకు పూసెనుగా
ఓ.. ఆ నీలాకాశం నాలా తప్పిపోయిందే
నావల్లే గాలికి గాల్లో తేలే వీలుందే

మౌనం మైనమై ప్రాణం కరిగేనా
నీలో లీనమై నన్నే చెరపనా

గాలిపటమై ఇలా
ఎగిరానేనిలా

దొరికావే ఎలా
మబ్బుల్లోనే పిల్లా

ఈ స్నేహమే.. హే.. తెలతెల్లని నా హృదయంపై హరివిల్లేనా
నీ స్నేహమే.. హే.. ప్రియురాలిని పుస్తకమల్లే చదివించేనా

వింటున్నా వింటున్నా నీ యద లొతుల థిల్లానా
కాస్తైనా తెలిసేనా నీ మది లోతెంతో మైనా

నీ పాదం వెంటే పరుగులు తీస్తూ వస్తున్నా
అలనురగలు మోసే కెరటంలా ఉరికిస్తున్నా
ఓ.. భూగోళం మొత్తం నేనే మోస్తున్నట్టున్నా
ఓ అణువంతైనా తొణుకే లేక నేనున్నా

నీ ప్రతి మాటలో ఏదో మౌనమా
నీ ప్రతి నవ్వులో నేనే శూన్యమా

తేలనీ నన్నిలా
తేనెటీగై అలా

తేనె బుడగై ఇలా
తాకనీ నిన్నిలా

మన స్నేహమే.. హే.. బిందువులా మొదలై నదిలా ప్రవహించేలా
మన స్నేహమే.. హే.. నడిమధ్యలొ బిందువు వద్దకు నది పయనంలా

ఎన్నాళ్ళే ఎన్నాళ్ళే మౌనంగా ఈ చదరంగం
ఇరు తీరం చేరాలే ఇద్దరిలో ఎవరో ఒకరం

నీకే తెలుసంట నీ గుండెల్లో ఏముందో
నీ సంతోషానికి సంబరపడుతూ ప్రేముందో
ఓ.. ఈ వీక్షణమంతా వీడిందంటే తక్షణమే
ఏ విలువుండదుగా ఇలలో ప్రేమకు ఈ క్షణమే

ప్రతీక్షణం పెదాలతో ప్రతీక్షణం నిరీక్షణ
ఇదెంత దాటలేని దూరమో కదా

ప్రతీక్షణం పదాలతో ప్రతీక్షణం నిరీక్షణ
ఈ లేత ప్రాయమెంత హాయిదో కదా


'Prateekshanam'. Sung by Dinker and Chaitra. Music by Mani Sharma. Lyrics by Shree Mani. From the film Basanti, directed by Chaitanya Dantuluri.

Alternate spellings: Pratheekshanam, Pratee / Prathee / Prati / Prathi Kshanam

No comments:

Post a Comment