Saturday, March 26, 2011

Vayyarala Jabilli - Theen Maar


After listening to it a couple of times, I started to like the song 'Vayyarala Jabilli' from the movie 'Theen Maar'. It somehow reminds me of this song - 'Hai Re Hai' from 'Sindhooram'. Manisharma composed the music and Karunya lent his vocals. It's simple, sweet and easily hummable. You can listen to the song here : వయ్యారాల జాబిల్లి.

Pa||
వయ్యారాల జాబిల్లి  ఓణి  కట్టి..గుండెల్లోన  చేరావే  గంటె  కొట్టి
ఆ నండూరి  వారెంకి  మళ్లి  పుట్టి ..కవ్వింతల్లో ముంచావే కళ్ళే మీటి
నదివలై కదిలా  నిలబడక..కలలను వదిలా నిను  వెతక
వయసే  వరస  మార్చినదే..మనసే  మధువు  చిలికినదే
అడుగే  జతను  అడిగినదే..అలలై  తపన  తడిపినదే  ||వయ్యారాల జాబిల్లి||

1 Cha||
నీ  పరిచయమే  ఓ  పరవశమై..జగాలు  మెరిసేను  లే  
నా  యద  గుడిలో  నీ  అలికిడిని ..పదాలు  పలుకవులే  
ఆణువణువూ  చెలిమి  కొరకు..అడుగడుగు  చెలికి  గొడుగు  
ఇది  వరకు  గుండె  లయకు..తెలియదులే  ఇంత  పరుగు  
వయసే  వరస  మార్చినదే ..మనసే  మధువు  చిలికినదే  ||వయ్యారాల జాబిల్లి||

2 Cha||
నీ ప్రతి తలపు నాకొక  గెలుపై..సుఖాలు  తొనికేనులే
నీ  శ్రుతి  తెలిపే  కోయిల  పిలుపే..తథాస్తు  పలికేనులే
గగనములా మెరిసి  మెరిసి..పవనములా మురిసి  మురిసి
నినుకలిసే  క్షణము  తలచి..అలుపు  అనే  పదము  మరచి
వయసే  వరసా  మార్చినదే..మనసే  మధువు  చిలికినదే  ||వయ్యారాల జాబిల్లి||

No comments:

Post a Comment